జగిత్యాల పట్టణంలో విషాద ఘటన నెలకొంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు.. ఉరివేసుకొని విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లింగంపేటలో స్థానిక స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ (15).. విపరీతంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడటంతో విష్ణుని మందలించారు తల్లిదండ్రులు.

దాంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకొని విష్ణు వర్ధన్ సూసైడ్ చేసుకున్నాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.