టెట్‌లో పాసైన అభ్యర్థులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెట్‌లో పాసైన అభ్యర్థులకు మంత్రి హరీష్‌ రావు శుభవార్త చెప్పారు. టీఎస్ టెట్ ఫ‌లితాల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో బుధవారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌లో 32 శాతం ఉత్తీర్ణ‌త సాధిస్తే.. కేవ‌లం సిద్దిపేట‌లోని కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంట‌ర్ నుంచి 82 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించార‌ని పేర్కొన్నారు మంత్రి హరీష్‌రావు.

618 మంది అభ్య‌ర్థుల‌కు గానూ 517 మంది పాస‌య్యార‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి హరీష్‌రావు. డీఎస్సీ నోటిఫికేష‌న్ రాక‌ముందే లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ ఇప్పిస్తామ‌ని ప్రకటించారు. త్వ‌ర‌లోనే గ్రూప్-4 నోటిఫికేష‌న్ రాబోతుంద‌న్నారు. దానికి కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తామ‌ని వెల్ల‌డించారు మంత్రి హరీష్‌రావు. అభ్య‌ర్థులంద‌రూ ఉద్యోగాలు సాధించిన‌ప్పుడే ఈ కేసీఆర్ కోచింగ్ సెంట‌ర్‌కు నిజ‌మైన సార్థ‌క‌త ల‌భిస్తుంద‌న్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version