వరల్డ్ ఫేమస్ లవర్ బయ్యర్లకి బంగారం లాంటి వార్త !!

-

ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీఖున విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ అయ్యింది. నలుగురు హీరోయిన్లతో కలసి నాలుగు లవ్ స్టోరీలతో సరికొత్తగా విజయ్ దేవరకొండ నటించడంతో సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఇదే సమయంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ అవ్వకముందు హడావిడి కూడా గట్టిగా చేయటంతో బయ్యర్లు భారీ డబ్బుకు సినిమాను కొనుగోలు చేశారు.

అయితే సినిమా విడుదలైన తర్వాత మొదటి షోకే ఫ్లాప్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో సినిమా 10 కోట్లకు మించి కూడా కలెక్షన్లు వసూలు చేయడం కష్టమని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సినిమా టాక్ వచ్చిన దానికి మొట్ట మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయి అనుకుంటే కనీసం 5 కోట్లు కూడా దాటలేని పరిస్థితి అన్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు ఇండస్ట్రీ నుండి అందుతున్న లెక్కల ప్రకారం 4.35 కోట్ల రూపాయల షేర్‌ వచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది కనుక మరో అయిదు కోట్లు రావడం కూడా కష్టమే అంటున్నారు.

 

దాంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలుస్తుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయ్యర్లు ఏకంగా 20 కోట్లు నష్టపోవడం కన్ఫర్మ్‌ అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో బయ్యర్లకు ఆదుకోవటానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు సమాచారం. నష్టపోయిన బయ్యర్లకు కొంతమేర డబ్బులు ఇవ్వడానికి విజయ్ దేవరకొండ ఇష్టపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నిజంగా విజయ్ దేవరకొండ ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులిస్తే కచ్చితంగా ఇది బయ్యర్లకు బంగారం లాంటి శుభవార్త అని చెప్పవచ్చు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version