యాదాద్రి భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచే భక్తులకు ఆలయంలోకి ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. కాగ ఈ నెల 28న యాదాద్రిలో మహా సంప్రొక్షణ నిర్వహిస్తున్నారు. ఈ మహా సంప్రొక్షణ మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు యాదాద్రి ఆలయం లోకి అనుమతి ఉంటుంది. కాగ ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు.
మహా సంప్రొక్షణ తో పాటు ఆలయంలో ఇతర కార్యక్రమాలకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. కాగ ఈ నెల 28న ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని తెలిపారు. అలాగే 9 : 30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర ఉంటుందని వివరించారు.
దీంతో పాటు 11 : 55 గంటలకు మహా కుంభసంప్రొక్షణ తో పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. అనంతరం ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానం చేస్తారని అన్నారు.