కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం : అమిత్ షా

-

కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జనగర్జన సభలో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు అమిత్ షా. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ ఆదివాసులకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణను ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో, కుంభ కోణాల్లో నెంబర్ వన్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణలో రైతులు, పేదలకు ఒరిగింది ఏం లేదన్నారు. కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. 

సీఎం కాక ముందు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఆ తరువాత దళితుడి ముఖ్యమంత్రి ఏమైంది అని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది అని ప్రశ్నించారు అమిత్ షా. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.   మోడీ ప్రభుత్వం తెలంగాణకు  కృష్ణా ట్రిబ్యునల్, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. డిసెంబర్ 03న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. మోడీ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకీ కేసీఆర్ ప్రభుత్వం స్థలం కూడా చూపించడం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 

Read more RELATED
Recommended to you

Exit mobile version