వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలను భారత్ సిరీస్ ను ప్రవేశపెట్టింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. దీని కారణంగా ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం లోని వాహన యజమాని మరొక రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినప్పుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బీహెచ్ సిరీస్ కింద వాహనాలు రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చును. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు గల కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ ఇతర ఆర్గనైజేషన్ లలో పనిచేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని వేరొక రాష్ట్రంలో కేవలం 12 నెలలు మాత్రమే ఉపయోగించవచ్చు. దీంతో చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ సిరీస్…తో ఆ దెబ్బలు వాహనదారులకు తప్పనున్నాయి