జీవితం అందరికీ ఒకేలా ఉండదు. అసలు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాలు, ఆనందాలు ఎలా వస్తాయో అలాగే బాధలు, దుఃఖాలు వస్తుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ బాధలని మర్చిపోతుంటారు. మర్చిపోవాలి కూడా. కానీ కొందరికి ఈ మర్చిపోవడమనేది అంత ఈజీగా జరగదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఈ బాధల వల్ల జీవితం స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితినే డిప్రెషన్ అంటారు.
డిప్రెషన్ లో చాలా రకాలున్నాయి. వాటి తాలూకు లక్షణాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేజర్ డిప్రెసివ్ డిజార్డర్
దీన్ని క్లినికల్ డిజార్డర్ అని అంటారు. సాధారణంగా ఇది ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అంతా బాగానే ఉన్నా కూడా ఏదో ఒకటి వీరిని డిప్రెషన్ కి గురి చేస్తూనే ఉంటుంది. కుటుంబం, పిల్లలు, మంచి జీతం ఉన్నప్పటికీ లోలోపల బాధపడుతూ ఉంటారు. దీని లక్షణాలు
రోజూ చేసే పనుల మీద ఆసక్తి తగ్గిపోవడం
శరీర బరువులో మార్పులు
నిద్రపోయే భంగిమల్లో మార్పులు
నిరంతర డిప్రెసివ్ డిజార్డర్
ఏ డిప్రెషన్ అయినా రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని నిరంతర డిప్రెసివ్ డిజార్డర్ అంటారు. ఈ దీర్ఘకాలిక డిప్రెషన్ వల్ల రోజు వారి పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది.
దీని లక్షణాలు..
విపరీతమైన బాధ, తీవ్రమైన నిరాశ,
కుతూహలం లేకపోవడం, భావాలు ప్రదర్శించకపోవడం,
పని మీద ఆసక్తి తగ్గిపోవడం,
ఆకలిలోమార్పులు.
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్
గర్భంలో బిడ్డను మోయడం సంతోషం సమయం. కానీ ఆ సమయంలో మహిళల్లో హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. దీనివల్ల గర్భంతో ఉన్నప్పుడు డిప్రెషన్డిప్రెషన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ డిప్రెషన్ బిడ్డ పుట్టాక కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకా, దీర్ఘకాలం వెంటాడే అవకాశం ఉంది.
లక్షణాలు
మూడ్ లేకపోవడం, బాధగా ఉండడం,
తరచుగా మూడ్ మారిపోవడం,
సమాజంలో కలవకపోవడం.