ఈపీఎఫ్ఓ కస్టమర్లు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ఎన్నో సమస్యల ని గతం లో ఎదుర్కొన్నారు. ఇ-పాస్‌బుక్ సేవలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇ-పాస్‌బుక్ ని కూడా డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ సేవలని పొందొచ్చు. అయితే ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌తో పాటు ఉమాంగ్ యాప్‌లో పాస్‌బుక్ సేవలను ఎవరైనా పొందవచ్చు.
https://unifiedportal-mem.epfindia.gov.in/, ఇ-పాస్‌బుక్ పోర్టల్ https://passbook.epfindia.gov.in లో ఈజీగా ఈపీఎఫ్ ఆన్‌లైన్ పాస్‌బుక్ డౌన్ లోడ్ చేసేయచ్చు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫుల్ బ్యాలెన్స్ ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. యజమాని, ఉద్యోగి వాటా బ్రేక్ అప్ వంటివి కూడా మనం తెలుసుకోవచ్చు.
ఈ సేవలని మీరు పొందాలంటే ముందుగా epfindia.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.
Our Services లోకి వెళ్లి ఇప్పుడు for employees ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాల్సి వుంది.
తర్వాత మెంబెర్ పాసుబుక్ పైన క్లిక్ చేసి… కొత్త వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యాలి.
యూఏఎన్ నెంబర్, క్యాప్చా కోడ్, పాస్‌వర్డ్ ని ఇచ్చేసి… లాగిన్ చేసిన తర్వాత పాస్‌బుక్ వస్తుంది. వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది.