స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన మనకి ఎన్నో లాభాలు వస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకూ అకౌంట్ వుందా..? అయితే ఈ అప్ డేట్ ని మీరు కచ్చితంగా చూడాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్, మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా సేవలని అందిస్తూ వుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఎస్బీఐ సేవలని ఇస్తోంది. ఇక మరి ఎలాంటి సేవలని ఇస్తోందనేది చూద్దాం. ఎప్పుడు స్టేట్ బ్యాంక్ కస్టమర్ల సౌకర్యం కోసం చూస్తూ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆన్‌లైన్, మొబైల్ ఆధారిత సేవలను నిరంతరాయంగా అందిస్తోంది.

ఇప్పుడు వాట్సాప్ సేవలని కూడా ఇస్తోంది బ్యాంకు. మీ మొబైల్ ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు. ఇక ఎలాంటి సేవలని మనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం. ఎస్బీఐ వాట్సాప్ ద్వారా తొమ్మిది బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది చూడచ్చు. అలానే మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ సేవ, లోన్ సమాచారం. డిపాజిట్స్ కి సంబందించిన సమాచారం తెలుసుకోవచ్చు.

అలానే సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ కి సంబంధించి డీటెయిల్స్ ని చూడచ్చు.
అంతే కాక NRI సేవలు, NRE ఖాతా, NRO ఖాతాల్లోని ఫీచర్లు కూడా చూడచ్చు. ఇన్‌స్టా ఖాతాలను తెరవడం, కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెసల్ హెల్ప్‌లైన్‌లు వంటివి తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version