స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎన్నో లాభాలు అందుతున్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు కూడా రిలీఫ్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కస్టమర్లు ఇక నుండి వాట్సాప్ ద్వారానే పెన్షన్ స్లిప్ ని పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం పెన్షన్ స్లిప్‌ ని వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కడైనా సరే పొందేందుకు అవుతుంది.

దీని కోసం మీరు వాట్సాప్ లో 9022690226కు మెసేజ్ చేయండి. కేవలం హాయ్ అని టెక్స్ట్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు కనపడతాయి.
బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ లో మీరు పెన్షన్ స్లిప్ అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఏ నెల పెన్షన్ స్లిప్ కావాలో దాన్ని ఎంటర్ చేయాలి.
మీకిక్కడ ప్లీజ్ వెయిట్ అనే మెసేజ్ వస్తుంది.
మీ పెన్షన్ స్లిప్ వివరాలు పొందొచ్చు.
అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ కలిగిన వారు నామినీ పేరు రిజిస్టర్ చేసుకోవడం అవసరం. మీరు దీని కోసం యోనో లో కానీ ఎస్‌బీఐ ఆన్‌లైన్ ని కానీ ఉపయోగించచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version