ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మాటిస్తే మడమతిప్పని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందులో భాగంగానే వైఎస్సార్ కాపు నేస్త పధకంనాలుగవ విడుత లో విడుదల చేయాల్సిన నిధులను ప్రజలకు తమ తమ ఖాతాలలో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. రేపు సీఎం జగన్ తూర్పగోదావరి జిల్లా నిడదవోలు లో పర్యటించనున్నారు… అక్కడ జరగనున్న బహిరంగ సభలో కాపు నేస్తం కింద ఇవ్వాల్సిన నాలుగవ విడుత అమౌంట్ ను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఇక స్కీం లో ప్రకటించిన విధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల లోపు మహిళలు అందరికీ రూ. 15 వేలు బ్యాంక్ అకౌంట్ లోకి జమ కానున్నాయి. ఈ పధకం ద్వారా ఈ విడతలో 357844 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.
ఇక పధకాలను చెప్పిన సమయానికి , చెప్పిన అమౌంట్ ను సీఎం జగన్ విడుదల చేస్తూ ప్రజలకిచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికలలోనూ ఓట్ల రూపంలో జగన్ కు వేసి గెలిపించుకుంటారా చూడాలి.