చంద్రబాబు తన అవినీతిలో పవన్ కల్యాణ్‌కు ఎంత వాటా ఇచ్చారో: జోగి రమేశ్‌

-

జనసేన, టీడీపీ ఎప్పుడూ కలిసే ఉన్నాయని.. వారిది విడదయలేని ఫెవికాల్ బంధమని మంత్రి జోగి రమేష్ అన్నారు. వీరి బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడు దేశంలోనే లేడని విమర్శించారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మంత్రి జోగి రమేష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ ఢిల్లీలో కేంద్రం కాళ్లు పట్టుకోడానికి వెళ్లాడన్నారు. అవినీతిపరుడైన తన తండ్రిని రక్షించాలి అంటూ అడగడానికి వెళ్ళాడని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అవినీతిలో పవన్ కల్యాణ్‌కు ఎంత వాటా ఇచ్చారో చెప్పాలన్నారు.

నిజంగా ఎన్టీఆర్ అభిమానులైతే చంద్రబాబును, లోకేష్ ను చెప్పులతో కొట్టాలి:  మంత్రి జోగి రమేష్ | Minister Jogi Ramesh shocking comments on chandrababu,  balakrishna and lokesh ...

నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలకు, జాతీయ మీడియాకు ఏం చెబుతారు? అని వైసీపీ నేత, మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీకి వెళ్లి మా తండ్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్లు నొక్కేశాడని, హవాలా రూపంలో వాటిని తరలించి తాము కొట్టేశామని జాతీయ మీడియాకు చెబుతారా? అని నిలదీశారు. జీ20 సదస్సు కారణంగా ఇప్పటి వరకు మీ అయ్య చంద్రబాబు చరిత్ర ఏపీకి మాత్రమే తెలిసిందని, ఇప్పుడు లోకేశ్ తనంతట తాను వెళ్లి ఆయన తండ్రి నిజసవరూపాన్ని జాతీయ మీడియా ముందు చెబుతాడట? అని ఎద్దేవా చేశారు. సిగ్గు, శరం వదిలేశారా? అని నిప్పులు చెరిగారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news