ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్

-

ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట (మ) బొడ్డవర వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజంతో గూడ్స్ వెళ్తుండగా.. 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలానికి డీఆర్ఎం, రైల్వే అధికారులు బయల్దేరగా.. ఇవాళ విశాఖ-కిరండోల్ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రద్దు చేశారు. ఒడిశాలో రెండు వారాల కిందట జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత రైలు జర్నీ అంటేనే కాస్త ఆందోళన చెందుతున్నారు ప్రజలు. నిన్న ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తెలిసిందే.

తాజాగా విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుము లోడ్ తో కిరండల్ నుంచి విశాఖకు వస్తుండగా ఎస్ కోట మండలంలోని బొడ్డవదర వద్ద గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. క్రాసింగ్ సమయంలో 6 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆదివారం రాత్రి విశాఖ నుంచి బయలుదేరనున్న విశాఖ- కిరండోల్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు రద్దు చేశారు. గూడ్స్ పట్టాలు తప్పిందన్న సమాచారం అందడంతో రైల్వే అధికారులు, డీఆర్ఎం బొడ్డవరకు బయలుదేరారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించనున్నారు. విశాఖ- కిరండోల్ ఎక్స్ ప్రెస్ మొత్తం 472 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 12 స్టేషన్లలో రైలు ఆగుతుంది. 12 గంటల 25 నిమిషాలు జర్నీ టైమ్ అని అధికారులు తెలిపారు. ఈ రైలు (Tr No 18514) ప్రతిరోజూ రాత్రి విశాఖ నుంచి బయలుదేరి అరకు, కోరాపుట్, దంతేశ్వర మీదుగా కిరండోల్ చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version