ఏ మూలకు వెళ్లినా ఈ ఎమ్మెల్యే దోపిడీ కనిపిస్తుంది : పవన్‌

-

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ద్వారంపూడి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉందని విమర్శించారు.

“ఇదే ప్రాంతానికి చెందిన అగ్నికుల క్షత్రియుడు, మత్స్యకార వర్గానికి చెందిన సత్యలింగ నాయకర్ 1800 సంవత్సరంలోనే బర్మా వెళ్లి బాగా డబ్బు సంపాదించి, ఆ డబ్బు ఇక్కడికి తీసుకువచ్చి ఓ ట్రస్టు స్థాపించి అన్ని కులాల వారికి కాలేజీలు స్థాపించాడు. ఆ స్థలాలను కూడా ఈ ద్వారంపూడి కొట్టేశాడు. ఏ మూలకు వెళ్లినా ఈ ఎమ్మెల్యే దోపిడీ కనిపిస్తుంది. ఈ రౌడీ, గూండా చంద్రశేఖర్ రెడ్డికి చెబుతున్నాను… ఈసారి ఎన్నికల్లో నిన్ను గెలవనివ్వను. ఇక్కడికే వచ్చేశా… మంగళగిరిలోనే ఉంటా. ఏ గూండా వస్తాడో రమ్మనండి… చూసుకుందాం” అంటూ పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరికలు చేశారు.

 

నిన్న కాకినాడ జనవాణి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. బియ్యం స్మగ్లింగ్ లోనే ద్వారంపూడి 15 వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు చెబుతున్నారని వివరించారు. ఇలాంటి కోన్ కిస్కా గాళ్ల మీద తనకేమీ వ్యక్తిగత కోపం ఉండదని, క్రిమినల్స్ గా ఉంటూ పాలిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version