సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఫొటోస్ సేవకు గాను ఉచిత స్టోరేజ్‌ను అందివ్వబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ఫొటోస్‌లో 15 జీబీ ఉచిత స్టోరేజ్ లభిస్తుంది. అయితే అంతకు మించి కూడా గూగుల్ ఇప్పటి వరకు ఉచితంగా స్టోరేజ్‌ను అందిస్తూ వచ్చింది. కానీ ఇకపై 15 జీబీ వరకు మాత్రమే స్టోరేజ్‌ను అందిస్తామని తెలిపింది. అందుకు జూన్ 1వ తేదీని గడువుగా విధించింది. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ దాటితే గూగుల్ ఫొటోస్‌లో 15జీబీ కన్నా ఎక్కువ స్టోరేజ్ లో ఫొటోలు ఉంటే అవి డిలీట్ అవుతాయి. కనుక యూజర్లు గడువు ముగియక ముందే ఆ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ ఫొటోస్‌లో ఫొటోలను పలు విధాలుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. photos.google.com సైట్‌లోకి వెళితే ఫొటో వారీగా ఒక్కో ఫొటోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఫొటోలు ఎక్కువగా ఉంటే చాలా సమయం పడుతుంది. కనుక ఆల్బమ్‌ల వారీగా కూడా ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు ఏదైనా ఆల్బమ్‌లోకి వెళ్లి అక్కడ కుడి వైపు పై భాగంలో ఉండే 3 చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. తరువాత డౌన్ లోడ్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దీంతో ఆల్బమ్ మొత్తాన్ని ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫొటోలు అన్నీ సింగిల్ జిప్ ఫైల్‌లో వస్తాయి. కాబట్టి జిప్ ఫైల్ డౌన్ లోడ్ అయ్యాక అందులో ఉండే ఫొటోలను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక గూగుల్ ఫొటోస్‌లో ఉండే ఫొటోస్ అన్నింటినీ ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు takeout.google.com అనే సైట్‌లోకివెల్లి అక్కడ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి అనంతరం అందులో ఉండే క్రియేట్ ఎ న్యూ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత చెక్ బాక్స్‌లు వస్తాయి. వాటిల్లో కేవలం గూగుల్ ఫొటోస్‌ను మాత్రమే ఎంచుకోవాలి. అనంతరం ఆల్బమ్‌లను ఎంచుకోవాలి. తరువాత ఓకేపై క్లిక్ చేసి తదుపరి స్టెప్‌కు వెళ్లాలి. దీంతో ఎక్స్‌పోర్ట్ ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ డెలివరీ మెథడ్ డ్రాప్ డౌన్ మెనూలో మెయిల్‌కు డౌన్‌లోడ్ లింక్ పంపించేలా సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో కొన్ని గంటల్లో మెయిల్‌కు లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గూగుల్ ఫొటోస్‌లో ఉండే ఫొటోస్ అన్నీ ఒకేసారి డౌన్ లోడ్ అవుతాయి.
అయితే గూగుల్ ఫోటోస్ లో మొత్తం స్టోరేజ్ 15జీబీ దాటితేనే ఫొటోలను పై విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి. స్పేస్ 15జీబీ మించకపోతే వాటిని డౌన్ లోడ్ చేయాల్సిన పనిలేదు.