గూగుల్‌ గో రికార్డ్‌.. హైస్పీడ్, లో స్పేస్‌!

-

గూగుల్‌ సెర్చ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘గూగుల్‌ గో’ రికార్డులు సృష్టిస్తోంది. గూగుల్‌ సెర్చ్‌ కంటే ఎక్కువ స్పీడ్, తక్కువ స్పేస్‌తో పనిచేసే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి యూజర్లు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ 2 ‘గూగుల్‌ గో’ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తున్న డివైజ్‌ లలో ప్రీ ఇన్‌స్టాల్‌గా ఉంటుంది. ప్లే స్టోర్‌లో గూగుల్‌ గో యాప్‌ 50 కోట్ల డౌన్‌లోడ్‌లను క్రాస్‌ చేసింది. రానురాను సంప్రదాయ గూగుల్‌ సెర్చ్‌కు బదులుగా గూగుల్‌ గో ని ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ రికార్డుతో ఆండ్రాయిడ్‌ గో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సక్సెస్‌ అయినట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

డేటా ఆదా అవుతుండటంతో పాటు తక్కువ స్పేస్‌ను తీసుకోవడం వల్ల గూగుల్‌ గో ను వాడే యూజర్లు పెరుగుతున్నారు. గూగుల్‌ గో యాప్‌ 2017లో సెర్చ్‌ లైట్‌ పేరుతో ప్రారంభమైంది. డేటా స్పీడ్‌ తక్కువగా ఉన్నవారికి ఈ గుగుల్‌ గో యాప్‌ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో నెట్‌వర్క్‌ కనెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడి ప్రాంతాల్లో కస్టమర్లు పరిమితమైన డేటా స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటారు. వారికి గూగుల్‌ గో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను డెవలప్‌ చేసినప్పటి నుంచి ఆండ్రాయిడ్‌ గో ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఫోన్లలో ఆటోమేటిగ్గా ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ గో ఓఎస్‌ ద్వారా విడుదలైంది కాబట్టి యాప్‌ పేరును ‘గూగుల్‌ గో’ అని మార్చారు. రెగ్యులర్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కూడా గూగుల్‌ గో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే సౌలభ్యం ఉంది.
దీంట్లో సెర్చ్‌ రిజల్ట్స్‌ 40 శాతం వరకు డేటాను ఆదా చేస్తాయి. నెట్‌వర్క్, డేటా వేగం తక్కువగా ఉన్నప్పటికీ, సెర్చ్‌ రిజల్ట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. దీని స్టోరేజ్‌ స్పేస్‌ 7ఎంబీ మాత్రమే కావడం విశేషం. మొదటిసారి స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారు గూగుల్‌ గోను వాడటం మంచిది. ఇక ఆలస్య మెందుకు మీరు కూడా గూగుల్‌ గోని డౌన్‌ లోడ్‌ చేసుకుని సులభంగా, వేగవంతమైన రిజల్స పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news