నిఖిల్ 18పేజెస్ కి హీరోయిన్ దొరికేసింది…

-

హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న 18పేజెస్ సినిమాకి హీరోయిన్ దొరికేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అందిస్తున్న కథతో వస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఐతే హీరోయిన్ గా అనుపమ్ పరమేశ్వరన్ ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. గత కొన్ని రోజులుగా ఆమెకి తెలుగులో అవకాశాలే రాలేదు. మరి వచ్చిన ఈ అవకాశంతోనైనా సక్సెస్ తెచ్చుకుంటుందేమో చూడాలి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version