గవర్నర్ తమిళిసై పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన తెలిపారురు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో లక్ష నల్ల జెండాలు ఎగుర వేసి నిరసన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారని తెలిపారు.రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈనెల 11న ఢిల్లీలో చేసే దీక్ష తో తెలంగాణ సత్తా చూపిస్తామనినారు. ఈ సందర్భంగా గవర్నర్ బిజెపి నేతల వ్యవహరిస్తున్నారని అన్నారు. గవర్నర్ వక్రబుద్ధి తో మాట్లాడుతున్నారని అన్నారు.ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఉగాది రోజున గవర్నర్ యాదాద్రి కి వెళ్లారు. పదినిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం కష్టంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆమె తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారని మంత్రి అన్నారు.గవర్నర్ రాజ్యాంగపరంగా నడుచుకోవాలి అన్నారు. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు గా కొనసాగిన తమిళ సైతమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు గా కొనసాగిన తమిళసై ఇప్పుడు కూడా అదేతమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు గా కొనసాగిన తమిళసై ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తాను అసెంబ్లీని రద్దు చేసే దాన్ని అని తమిళిసై మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీని రద్దు చేసిన రామ్ లాల్ కు ఏం జరిగిందో గవర్నర్ గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.