ఇటీవలే భారత ప్రభుత్వం ట్విట్టర్ కు హెచ్చరికలు జారీ చేసింది. భారత సరిహద్దుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్విట్టర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇటీవలే జాతీయ భద్రత విశ్లేషకులు నితిన్ గోకలే లెహ్ ప్రాంతంలో ఉన్న అమరవీరుల స్మారకం హాల్ ఆఫ్ ప్రేమ్ దగ్గర ట్విట్టర్ లో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు లేహ్ ప్రాంతం చైనా లో ఉన్నట్లుగా చూపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు గమనించి చూడగా భారత భూభాగంలోని లడక్ ప్రాంతంలో ఉన్న లేహ్ భూభాగం చైనా లో ఉన్నట్లుగా ట్విట్టర్ మ్యాప్ సెట్టింగ్ లో ఉంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత పౌరుల మనోభావాలను గౌరవించండి భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కించ పరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. చివరికి అది మ్యాప్ లో అయినా సహించేది లేదు.. ఇలా ఒక దేశ భూభాగాన్ని మరో దేశంలో చూపించడం చట్టవిరుద్ధం అంటూ ట్విట్టర్ తీరుని ఖండిస్తూ భారత ప్రభుత్వం లేఖ రాసింది.