కర్నూల్ ను రాజధాని గా చేసి రాయల సీమను అభివృద్ధి చేస్తా అని వైసీపీ ప్రభుత్వం అంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే రాయల సీమ కు చెందిన మాజీ ముఖ్య మంత్రి దామోధర సంజీవయ్య నే పట్టించు కోని ప్రభుత్వం.. రాయల సీమ ను అభివృద్ధి చేస్తుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలాగే ఆయన స్మారక భవనం కట్టని ప్రభుత్వం.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చేస్తుందా.. అని అన్నారు.
దామోధర సంజీవయ్య స్మారక భవనానికి తాను స్వంతం గా రూ. కోటి ఇచ్చానని అన్నారు. ఇప్పుడు వైసీపీ మూడు రాజధానులు అంటే ఎలా నమ్మాలని విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ని భరించాలని అన్నారు. అప్పటి వరకు వారి గుండాయిజం, రౌడీయిజం, బూతులు అన్ని భరించాలని అన్నారు. తర్వాత ప్రభుత్వం మారలని అన్నారు. మాడి పోతున్న.. పెనం పై ఓటు అనే చినుకును వేయ వద్దని అన్నారు.