కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు గాను ఎన్నికల్లో మరో సంస్కరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్రం కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఉన్న విధానాల వలన ఒకరి పేరు మీదనే చాలా కార్డులుంటున్నాయని, ఒకే వ్యక్తి అనేక చోట్ల ఓటు వేస్తున్నారంటూ వస్తున్న విమర్శలకు సంబంధించి లోక్ సభలో ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక్క సరి కనుక ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధానం పూర్తైతే… ఎవరు ఎక్కడ ఓటేశారో తెలుసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.