తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారుజామున తోమాల, అర్చన సేవల్లో గవర్నర్ జిష్ణుదేవ్ పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గవర్నర్‌కు ఆలయ పూజారులు రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం అందించారు.
ఆ తర్వాత అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుండగా 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.