కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. అందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా హర్ష సాయితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా కనిపించడం లేదు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.ఇప్పటికే హర్షసాయి మీద లైంగికదాడి, చీటింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అతని తండ్రిపై కూడా కేసు నమోదైంది. తనకు మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు హర్ష సాయికి ఎక్కడున్నాడనే విషయంపై ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే,న్యాయపరంగా ఎదుర్కొంటామని హర్ష సాయి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని వారు చెబుతున్నారు.కాగా, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది.ప్రేమ,పెళ్లి పేరుతో లొంగదీసుకున్న నగ్న వీడియోలు,చిత్రాలను అంటి పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తనపైన లైంగికదాడి చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.