తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి వివాదం పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ వివాదం ముదురుతున్న నాటి నుంచి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుసగా జిల్లాల పర్యటనలతో దూసుకెళ్తున్నారు. గత నెలలో నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు చెంచు గూడెంలలో పర్యటించారు. తాజా గా ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు.
ఈ పర్యటన కోసం గవర్నర్ తమిళి సై.. ఆదివారం రైలు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. నేడు ముందుగా భద్రాద్రి రామాయ్య మహా పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళి సై పాల్గొననున్నారు. సీతా రామయ్య దర్శనం అనంతరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు. గిరిజన ప్రజలకు ఉన్న పోషకాహార లోపం నుంచి సమస్య నుంచి విముక్తి కల్పించడానికి చేపుడుతున్న పనులను అక్కడ ప్రారంభించనున్నారు. అలాగే కొండ రెడ్ల తెగకు చెందిన రెండు దత్త గిరిజన గ్రాములు అయిన పూసుకుంట, గోగులపూడీలో గవర్నర్ తమిళి సై పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.