పెండింగ్ లో ఉన్న పలు బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ గవర్నర్ తమిళిసై దగ్గర పెండింగ్ లో పలు బిల్లులు ఉన్న విషయం తెలిసిందే. అయితే నేడు పలు బిల్లుల పై అభ్యంతరం వ్యక్తం చేశారు తమిళ సై. అవేంటంటే..

1. వర్శిటీ ల లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ల భర్తీకి కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఏర్పాటు బిల్లు.. పలు అంశాల పై క్లారిటీ ఇవ్వాలని మంత్రి కి అధికారులకు లేఖ రాశారు గవర్నర్. యూజీసీ అభిప్రాయం కోరారు. నియామక ల పై విధి విధానాలు , లోకల్ నాన్ లోకల్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ.. న్యాయ పరమైన చిక్కులు ఎదురైతే పరిస్థితి ఎంటి లాంటి అంశాల పై వివరణ కోరారు గవర్నర్. ప్రస్తుతం ఉన్న విధానం లో రిక్రూట్ చేస్తే అభ్యంతరం ఏంటని అడిగారు. విధివిధానాలు రూపొందించి , ప్రాసెస్ ప్రారంభించే వరకే ఎన్నికల నోటిఫకేషన్ వస్తె పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ప్రభుత్వ అధికారులు ఉండడం … దాని చట్టబద్దత పై యూజీసీ అభిప్రాయం కోరారు.

2. వైద్య విద్య లో ఫ్యాకల్టీ వయో పరిమితి పెంపు బిల్లు పై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్. ఫాకల్టీ కి 65 ఏళ్లు పెంచడం ఒకే కానీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ల్లో ఉన్న వారికి వయో పరిమితి ఎలా పెంచుతారు అని గవర్నర్ అడుగుతున్నట్టు సమాచారం. Dme, అడిషనల్ dme పోస్ట్ ల వయో పరిమితి 65 ఏళ్లు ఎలా కరెక్ట్ అని అడిగినట్టు సమాచారం.

3. ప్రైవేట్ యూనివర్సిటీ ల బిల్లు … కావేరి వర్శిటీ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం… ఆ సంస్థ కు విద్యా రంగం లో ఎలాంటి అనుభవం లేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం

4. మోటర్ వెహికిల్ చట్ట సవరణ బిల్లు పైన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం..

5. అజామ బాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు…. తన పరిధిలో లేదని రాష్ట్ర పతి ఆమోదం కావాలని అన్న గవర్నర్ తమిళ్ సై…

Read more RELATED
Recommended to you

Latest news