గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైకి షాక్.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాలు

-

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ కు కేసీఆర్ స‌ర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మార్చి 7వ తేదీ నుంచి జ‌ర‌గ‌బోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ప్రారంభించాల‌ని సంచల‌న నిర్ణ‌యం తీసుకుంది. కాగ అసెంబ్లీ సంప్రాదాయం ప్ర‌కారం ప్ర‌తి అసెంబ్లీ స‌మావేశాలు.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతోనే ప్రారంభం అవుతాయి. కాగ ఈ సంప్రాదాయానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ్రేక్ ఇవ్వ‌నున్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య విభేధాలు వ‌స్తున్నాయి. మొన్న మేడారం జాత‌ర స‌మ‌యంలోనూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై వ‌చ్చే స‌మయంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు ఎవ‌రూ కూడా అందుబాటులో లేరు. ఈ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రొటో కాల్ పాటించ‌లేద‌ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయినా రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ విషయంలో వెన‌క్కి త‌గ్గడం లేదు. కాగ గ‌తంలో 1970, 2014 ల‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news