వివాహం చేసుకోవడం విడాకులు తీసుకోవడం నేటి కాలంలో చాలా కామన్ అయిపోయింది. వివాహం చేసుకున్న జంటలు పెళ్లికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చిన్న చిన్న విషయాలకి విడాకుల వరకు వెళ్తున్నారు. నేటి కాలంలో చాలామంది సినీ జంటలు ఇలా చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో జంట చేరారు. నటుడు గోవింద – సునీత అహుజా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో విపరీతంగా వార్తలు వస్తున్నాయి.

తన భర్త గోవిందపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులకు అప్లై చేసినట్లుగా తెలుస్తోంది. పిటిషన్ లో తన భర్త గోవింద ప్రతిరోజు హింసిస్తున్నాడని, ఆమెను మోసం చేశాడని సునీత పేర్కొన్నారు. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. అప్పుడు సునీత ఆ వార్తలపై స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇప్పుడు మరోసారి ఇలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సునీత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.