మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది రాత్రిపూట మంచి నిద్ర పోవడం. కానీ చాలామందికి నిద్రలో ఎదురయ్యే సమస్యలకు ప్రధాన కారణం వారి ఉపయోగించే దిండు అని తెలియదు. సరైన దిండు లేకపోతే మెడ, భుజాల నొప్పులు తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది చిన్న విషయం అని మీరు అనుకుంటే మీ ఆరోగ్యం పై పెద్ద ప్రభావం పడుతుంది. అందుకే మీకు అనువైన దిండు ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర లేకపోతె ఎన్నో సమస్యలు వస్తాయి.ఒత్తిడి,అసహనం,బద్ధకం,బీపీ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మంచి నిద్ర కోసం మంచి దిండు అవసరం. మీ తల మెడ భుజాలను సరిగ్గా సపోర్ట్ చేసేలాగా దిండ్లు ఉండాలి. దిండు ఎక్కువ ఎత్తుగా లేదా తక్కువగా ఉన్నప్పుడు మీ మెడ సహజ స్థితిలో ఉండదు. దీనివల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నిద్రలో అసౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా చాలా గట్టిగా మరీ మెత్తగా ఉన్న దిండు కూడా తగినంత సపోర్ట్ ఇవ్వదు. దీనివల్ల ఉదయం లేవగానే మెడ పట్టేసినట్లుగా అనిపించి మేడం తల నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తుంది. రకరకాల దిండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్నిటిని చూద్దాం..

మెమరీ ఫామ్ పిల్లోస్ ఇవి మీ మెడ ఆకృతి అనుగుణంగా మారి మంచి సపోర్ట్ ఇస్తాయి. మెడ నొప్పులు ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి. ఫెదర్ పిల్లోస్ ఇవి చాలా మెత్తగా సులభంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఉంటాయి కానీ ఇవి కొందరికి ఎలర్జీ సమస్యలు కలిగిస్తాయి. మరోరకం పాలి ఫైబర్ పిల్లోస్ ఇవి తక్కువ ఖర్చుతో లభిస్తాయి సులభంగా ఉతికేందుకు వీలుగా ఉంటాయి అయితే ఇవి ఎక్కువ రోజులు ఒకేలాగా ఉండవు.తొందరగా పాడవుతాయి. మీకు అనువు గా వున్నా దిండ్లు ఎంచుకోవటం ముఖ్యం.
సౌకర్యవంతంగా ఉండే దిండ్లని ఎంచుకోవడం ముఖ్యం నిద్రపోయే విధానం కూడా దిండు ఎంపికపై ప్రభావం చూపుతుంది దిండును ఎంచుకునేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా నొప్పులు లేకుండా నిద్రించవచ్చు. మీ దిండును ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చండి. ఎందుకంటే కాలక్రమైనా అందులో ఉండే దుమ్ము, ధూళి చేరి ఎలర్జీలను కలిగిస్తాయి. మీ నిద్రను మెరుగుపరచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.