ప్రొడ్యూసర్ కిడ్నాప్ కేసులో ఇద్దరు ప్రభుత్వ గన్మెన్ లు ?

-

ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్‌ శివగణేష్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కొండా రెడ్డి అండ్ గ్యాంగ్ కోసం బంజారా హిల్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌ లో కొండా రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీస్తున్నారు. స్పెషల్‌ టీమ్‌ ఒకటి ఇప్పటికే కడపకు చేరుకుంది. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మొత్తం 15 మందిపై ఫిర్యాదు చేశాడు బాధితుడు.

శివ గణేశ్‌ అపార్ట్‌ మెంట్‌, ఎర్ర మంజిల్‌ వద్ద సీసీ ఫుటేజ్‌ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కడపలోని రెండెకరాల పొలాన్ని అమ్మి పెడతానని హైదరాబాద్‌ కు పిలిపించి కొండారెడ్డి తుపాకులతో బెదిరించాడని బంజారా హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు శివ గణేష్‌. కడప పోలీసులు అదుపులో కొండా రెడ్డి, ఇద్దరు ప్రభుత్వ గన్మెన్లు ఉన్నారని తెలుస్తోంది. శివ గణేష్ ను బెదిరించిన తర్వాత కడప వెళ్ళిపోయున ఇద్దరు ప్రభుత్వ గన్మెన్లని అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు ఈ రోజు హైద్రాబాద్ తీసుకురానున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version