ఏపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం గంట గంటకు పెరుగుతుంది. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల నుంచి దాదాపు 30 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకటి రెండు కరోనా కేసులు నమోదు అయిన ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఒక్కసారే ఇన్ని కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇప్పుడు ఏపీలో నమోదు అయిన కేసుల సంఖ్య 58కి చేరింది. దీనితో ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఆందోళన మొదలయింది. ఏ విధంగా కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అని చూసినా సరే అది మాత్రం పెరగడం, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా కరోనా విస్తరించడం తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. ఇది పక్కన పెడితే ఏపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళను గుర్తించడం లో విఫలం అయింది అంటున్నారు.

అవును వాళ్ళను గుర్తించే విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అంటున్నారు. వాలంటీర్లను నమ్ముకోవడమే కొంప ముంచింది అని… అన్ని దేశాలు వైద్యులను నమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లను నమ్ముకోవడం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇదే అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news