కరోనా వైరస్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే 21 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అంటున్నారు. సోమవారం వరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అలాంటిది ఒక్క రోజే 14 కేసులు బయటపడ్డాయి అనే అనుమానాలు వ్యక్తమవుతుంది.
జిల్లా కేంద్రమైన ఏలూరులో 8, భీమవరంలో 2, ఉండిలో 1, గుండుగొలనులో 1, పెనుగొండలో 1 కేసు నమోదు అయ్యాయని సమాచారం. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 కరోనా కేసులు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఏ స్పష్టత రావడం లేదు. ఏపీలో అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉనట్టు తెలుస్తుంది.
ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్లకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆ 14 మంది ఎవరితో మాట్లాడారు…? ఎవరితో తిరిగారు అనే దాని మీద ఇప్పుడు అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆశ్రం ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.