ఏపీలో నామినేటేడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు

-

ఆంధ్రప్రదేశ్ లో నామినేటేడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటేడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు రాజీనామాలు చేయాలని ఆదేశించింది. వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని.. ఈ మేరకు అన్ని శాఖల సెక్రెటరీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేసారు. గురువారం రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. మరోవైపు మంత్రుల పేషీల్లోని సిబ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్ లను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని.. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్ ని కూడా అక్నాలెడ్జ్ చేసివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version