ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈనాడు అధినేత రామోజీరావు కు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో నిన్న అర్ధరాత్రి ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన బెడ్ రూమ్ లో ఒక్కసారిగా కుప్పకూల డంతో… రామోజీరావును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామగుడా లోని స్టార్ హాస్పిటల్ లో ఈనాడు అధినేత రామోజీరావు చికిత్స తీసుకుంటున్నారట.
ఆయనను వెంటిలేటర్ పైన వేసి మరీ చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వెంటనే వేశారట. ఇంకా ఆయన హెల్త్ బులిటను కూడా రిలీజ్ చేయలేదు ఆసుపత్రి వైద్యులు. ఇవాళ ఉదయం 7 గంటల తర్వాత రామోజీరావు హెల్త్ బులిటెన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.