ఏపీలో పంచాయతీ ఎన్నికల పై పెద్ద పంచాయతీ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం మీద ఏపీ సర్కార్ దూకుడు పెంచింది కరోనా నేపథ్యంలో ఎన్నికల వెళ్లేందుకు సర్కార్ ససేమిరా అంటోంది ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం కూడా గవర్నర్ వద్దకు వెళ్లి పరిస్థితి మొత్తం వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అంతేగాక ఈ పరిణామాలన్నీ ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ అధికారంతో సి ఎస్ ఎన్నికల సంఘాన్ని ఎదిరిస్తున్నారు అంటూ నిన్న నిమ్మగడ్డ రమేష్ సి ఎస్ కు పంపిన ఎస్ఎంఎస్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం సీఎంకు లేదని ఆయన పేర్కొన్నారు. మరో వైపు మొన్నటి వరకు ప్రభుత్వం vs ఎస్ ఈ సీ గా ఉన్న సీన్ ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వాధికారుల మధ్య గొడవ గా మారింది.