అజ్ఞాతంలోకి బండి సంజయ్.. హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్ !

ఎన్నిక‌ల క‌మిష‌న్ కు బండి సంజ‌య్ రాసాడంటూ విడుద‌లైన‌ లేఖ‌‌పై వివాదం కొనసాగుతోంది. ఈ లేఖ తాను రాయలేద‌ని బండి సంజ‌య్ చెబుతున్నారు. ఇక ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లేఖ‌పై నిజాలు తేల్చుకుందామంటూ  సీఎంకు బండి స‌వాల్ విసరారు. భాగ్య‌ల‌క్షి ఆల‌యం వ‌ద్ద‌కు రావాలంటూ … ముఖ్య‌మంత్రి స‌వాల్ విసిరిన బండి సంజ‌య్ రాష్ట్ర కార్యాల‌యం నుండి చార్మినార్ వ‌ర‌కు బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు.

అయితే ఎన్నికల కోడ్ ఉండడటం తో అనుమ‌తి లేదంటున్నారు పోలీసులు. షెడ్యూల్ ప్రకారం భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యానికి బండి సంజయ్ ఎట్టిప‌రిస్థితుల్లో వ‌స్తాం అని పేర్కొన్నారు. 12 గంటలకు భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు సంజ‌య్ వస్తారని భావిస్తున్నారు. దీంతో బండి సంజయ్ అరెస్ట్ కు పోలీసులు సిద్దమయ్యారు. నిఘా వర్గాలకు సైతం బండి సంజయ్ ఆచూకీ దొరకడం లేదు. శుక్ర‌వారం కావ‌డంతో పోలీసు టెన్ష‌న్ నెలకొంది. ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందో ? అని టెన్షన్ నెలకొంది.