రియల్ ఎస్టేట్ కోసం భూములను లాక్కుంటున్నారు : కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూ సేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటుందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు కేటీఆర్.

పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్ పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని సూచించారు కేటీఆర్. ఈ విషయంలో ప్రభుత్వం పై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తరువాత నరేందర్ రెడ్డి భార్య శృతితో కూడా కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేష్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 గా బీఆర్ఎస్ నేత సురేష్ పేరు చేర్చినట్టు కేటీఆర్ తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version