మోడీ సర్కార్ సాధించిన గొప్ప విజయం.. ప్రధాన మంత్రి జన ధన్ యోజన..!

-

ప్రధాన మంత్రి జన ధన్ యోజన పథకం కింద, దేశంలోని ప్రజలందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలనే లక్ష్యంగా జన ధన్ యోజన ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జన్ ధన్ ఖాతాలను జీరో బ్యాలెన్స్‌పై తెరుచుకోవచ్చు. అయితే జన్ ధన్ ఖాతాల ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని ఇది మోడీ సర్కార్ సాధించిన గొప్ప విజయంగా చెప్పచు అంటున్నారు. కాగా తాజా అధ్యయనంలో, పిఎమ్‌జెడివై కింద, సగానికి పైగా అంటే 55 శాతం మంది మహిళా ఖాతాదారులు ఉన్నట్లు తేలిసింది. అంటే ఇక్కడ కూడా మహిళలదే పైచెయ్యి అని తేలింది.

ఆర్టీఐ కింద కోరిన సమాచారంలో ఈ సమాచారం బయటపడింది. అయితే పురుషులు, మహిళలు ఖాతాల్లో సేవింగ్స్ కు సంబంధించిన డేటా మాత్రం ఇవ్వలేదు. మధ్యప్రదేశ్ సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్‌కు ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో 2020 సెప్టెంబర్ 9 వరకు ప్రధాన మంత్రి జన ధన్ యోజన కింద మొత్తం 40.63 కోట్ల ఖాతాలు ఉన్నాయని, వీటిలో 22.44 కోట్ల ఖాతాలు మహిళలవి , 18.19 కోట్ల ఖాతాలు పురుషులవని వారు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ ప్రారంభం నాటికి ఆర్థిక శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రధాన మంత్రి జన ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్లు 8.5 శాతం పెరిగి 1.3 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఏప్రిల్ 2020 నాటికి PMJDY ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ .1,19,680.86 కోట్లు ఉన్నాయని, ఇది 9సెప్టెంబర్ 2020 నాటికి 8.5 శాతం పెరిగి రూ .1,29,811.06 కోట్లకు అవుతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version