జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. చాలా శాతం మంది ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొంటే వాటిని పరిష్కరించడానికి ఎంతో కష్టపడతారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం కష్టమవుతుంది. దీని వలన ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాలలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎంతో కష్టం, దాని వలన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కనుక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.
అటువంటి సమయంలో ఎమోషనల్ హీలింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు. దీని వలన జీవితాన్ని మళ్లీ సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుంది. ఎమోషనల్ హీలింగ్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది మరియు శాంతియుతంగా, బలంగా మారవచ్చు. ముఖ్యంగా, ఎలాంటి సందర్భంలో అయినా కోపం, ఆందోళన వంటి భావనలు కలిగినప్పుడు వాటిని అంగీకరించడం మొదలు పెట్టాలి. అదే ఎమోషనల్ హీలింగ్ లో మొదటి దశ. భావోద్వేగాలను నియంత్రించేందుకు ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. అంతేకాకుండా భావోద్వేగాలను మరియు ఆలోచనలను డైరీ లో రాయడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవాలి. భావోద్వేగాలను పంచుకోవడం వలన మనసు ఎంతో తేలిక అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఒత్తిడికి గురైతే, నిపుణులతో మీ సమస్యలను పంచుకుని కౌన్సిలింగ్ పొందడం అవసరం. జీవితంలో ఎప్పుడూ పాజిటివిటీ ఉండాలి. ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల వల్ల మీరు ఇబ్బందిని ఎదుర్కొంటే, వారిని క్షమించాలి. క్షమించడం వలన భావోద్వేగాలు తగ్గుతాయి. పైగా భావోద్వేగాల నుండి త్వరగా కోలుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.