పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి…!

-

పదిమందితో నవ్వుతూ మాట్లాడితే అందరు గౌరవిస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వారి లో ఆరోగ్యం కూడా బాగుంటుంది. పదిమందితో నవ్వుతు మాట్లాడితే సత్సంబంధాలు పెరుగుతాయి. అందుకే మనిషి నవ్వుతు మాట్లాడాలి. కాని కొందరు నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం పచ్చ రంగులోకి మారిన పళ్ళే. ఈ సమస్యను ఇంటి చిట్కాలతో దూరం చేయవచ్చు.

మనం నిత్యం వంటలలో ఉపయోగించే పసుపు లో సహజమైన పాలిషింగ్ గుణాల వల్ల పసుపుని బ్రష్ చేసుకోవడం వల్ల రంగు మారిన పళ్ళు తెల్లగా మారతాయి. అరటి పండు ని ఇష్ట పడనివారు ఉండరు. అలాంటి అరటి లో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే బ్లీచింగ్ గుణాల వల్ల పళ్ళపై అరటి తొక్కతో రోజు రుద్దడం వల్ల పచ్చ రంగు కాస్తా తెల్లగా మారుతుంది. ప్రతి రోజు తులసి ఆకులను నమిలితే పళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. బ్యాక్టీరియా తో పోరాడి పళ్ళకి ఆరోగ్యాన్ని అందించటంలో తులసి సహాయపడుతుంది.

ఉదయాన్నే బ్రష్ చేయడానికి పేస్ట్ బదులు ఉప్పు, నిమ్మరసం కలిపి పళ్ళు శుభ్రం చేస్తే పళ్ళు మెరుస్తాయి. నారింజతో పాటు సిట్రస్ కలిగిన పండ్లలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పళ్ళపై ఉండే మరకలను తొలగించటానికి మంచి సాధనాలుగా ఉపయోగపడతాయి. స్ట్రా బెర్రీ లో యాంటి ఆక్సిడెంట్ లు ఉండటం వలన ఇవి కూడా పళ్లకు బాగా ఉపయోగపడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా నేచురల్ బ్లీచింగ్ గుణాలను కలిగి బ్యాక్టీరియా ని తరిమికొట్టి పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news