జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రామచంద్రంపేటలో దారుణం చోటుచేసుకుంది.పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్ళి కొడుకు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతని మృతికి కారణాలు తెలియరాలేదని తెలుస్తోంది.
మృతుడు ఇంట్లో అందరికంటే యాక్టివ్‌గా ఉండేవాడని, ఎందుకు అత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని బంధువులు అంటున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ మృతితో బంధువులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. కాగా, అబ్బాయి మరణానికి లవ్ ఎఫైర్ ఏమైనా కారణమా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పెళ్లికీ ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్న పెళ్ళికొడుకు కిరణ్..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్న పెళ్ళికొడుకు కిరణ్.. ఇంట్లో అందరికంటే యాక్టివ్ గా ఉండేవాడని, ఎందుకు అత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదంటున్న బంధువులు.… pic.twitter.com/igmBJ1OD7D
— ChotaNews App (@ChotaNewsApp) March 8, 2025