సాధారణంగా పండుగల సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకమీద రైల్వే ఫ్లాట్స్ ఫామ్స్ మీద రద్దీని నియంత్రించేందుకు కొత్త రూల్ తీసుకొచ్చింది.
రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ కన్‌ఫార్మ్ అయ్యాకే రైల్వే స్టేషన్లలోకి ఎంట్రీ ఇవ్వాలని, లేనివారు రావొద్దని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీనిద్వారా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట దేశ వ్యాప్తంగా 60 ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆయన వెల్లడించారు.