అక్కడ పెళ్ళికొడుకులు వీటిని తప్పక చెయ్యాలి..లేకుంటే జన్మలో అంతే..

-

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిన కూడా మూడు నమ్మకాలు మాత్రం తగ్గలేదు..మాకు ఇవే తెలుసు అంటూ కొందరు మూర్ఖత్వం తో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరి కొంత మంది వివిధ రకాల ఆచారాల తో జనాలను ఆలోచనలో పడవేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో అయితే పెద్దలంతా కలిసి వారికి వారే కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు అమలు చేస్తుంటారు..అందులో కొన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి నిబంధనలే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామాల్లో విధించుకున్నారు. అబ్బాలులు గడ్డం పెంచకూడదు, శుభకార్యాల్లో డీజేలు అసలే వాడకూడదు.. ముఖ్యంగా పెళ్ళికొడుకు..

ఇదేక్కడి విచిత్రం రా బాబు అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..విషయాన్నికొస్తే.. రాజస్థాన్ రాష్ట్రం పాలి నగరంలో గురువారం కుమావత్ సొసైటీకి చెందిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సొసైటీకి చెందిన 19గ్రామాల్లో కొన్ని నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు. వివాహ సమయంలో వరుడికి గడ్డం ఉండకూడదు, అలాగే ష్యాషన్ పేరుతో దుబారా ఖర్చులను పూర్తిగా తగ్గించాలి, డీజేలు, అలంకరణలకు వృథా ఖర్చులు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వివాహం, నిశ్చితార్థం, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో నల్ల మందు, మద్యం తదితరాలను పూర్తిగా నిషేధించారు. సొసైటీకి చెందిన లక్ష్మణ్ ట్యాంక్, బొహ్రారామ్ మాల్వియా ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..

అక్కడ వరుడును రాజుగా భావిస్తారు.అందుకే అలాంటి సమయంలో ఇలాంటి నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు. వరుడు గడ్డం పెంచితే కీడు కలుగుతుందని అక్కడి వారు భావిస్తారట. మరోవైపు వివాహ సమయంలో వధువు తరపు వారు గరిష్టంగా 2 తులాల బంగారం, 2 జతల వెండి కర్రలు, వధువు దుస్తులతో కూడిన వెండి కండోరను ఇచ్చేలా మాట్లాడుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాదిలోని వివిధ నగరాల నుంచి 20 వేల మంది వలసదారులు.. 19 గ్రామాలలో నివాసం ఉంటున్నారు. వారు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రత్యేకంగా చెబుతారు… అలా కాదని వ్యతిరేకంగా వెళితే మాత్రం ఊరి బహిష్కరణ ఉంటుందట..బాపురే ఇదేం ఆచారాలు..

Read more RELATED
Recommended to you

Exit mobile version