త్వరలోనే గ్రూప్ 1, 3 నోటిఫికేషన్లను రిలీజ్ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. టీఎస్పీఎస్సీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాణీప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
మల్టీజోనల్ ప్రకారం పోస్టుల విభజన పూర్తయిన వెంటనే గ్రూప్ 1, 3 పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు వాణీ ప్రసాద్ స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ నియామకాలపై పలు అర్హతల విషయంలో కోర్టుల్లో 600 కేసులు వేశారని.. అందుకే నియామక ప్రక్రియ లేట్ అవుతోందని అన్నారు.