జగన్ చుట్టూ కోటరీలు పెరిగిపోయాయ్‌…!

-

అవినీతి లేని పాలన, పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంలో కోటరీలు పెరిగిపోయాయ? అంటే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా ఈ కోటరీల పాలన చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు చుట్టూ చాలా మంది అధికారులు, నేతలు కోటరీలు ఏర్పడి అంతా మాదే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఆ కోటరీల్లో కూడా చంద్రబాబుకు చెందిన సామాజికవర్గం వారే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా సచివాలయంలో ఆ సామాజికవర్గం అధికారులదే పెత్తనం ఎక్కువగా ఉంటుంది.

వారు చెప్పేది నడిచేది. దీని వల్ల మిగతా సామాజికవర్గాల చెందిన అధికారులకి ఇబ్బందిగా ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లేదు. వైసీపీ ప్రభుత్వం ఉంది. జగన్ పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. దీంతో ఈ కోటరీలు గట్ర ఉండవు అనుకున్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో కూడా నిదానంగా కోటరీలు ఏర్పడుతున్నాయి. అందులో ముఖ్యంగా జగన్ తర్వాత ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత గల సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చుట్టూ ఓ వర్గం ఉండగా…ప్రభుత్వ సలహాదారు కల్లాం అజయ్ కుమార్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ ఏర్పడింది.


వీరి మధ్య అధికార పెత్తనం ఎవరిది ఎక్కువ అనే విషయం మీద చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అసలు ఇందులో ఎవరి నిర్ణయాలని ఎవరు ఆమోదించాలనే దానిపై క్లారీటీ లేదు. మామూలుగా సీఎస్ కు స్వతహాగా ఏ నిర్ణయమైన తీసుకోగల అధికారం ఉంది. కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ సలహాదారుకు చెప్పి చేయాల్సి వస్తోంది. దీనిపై సీఎస్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా సీఎం కూడా వీరి అధికారాలపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో సమస్య ఇంకా పెద్దది అవుతుంది.

వీరిని పక్కనబెడితే ప్రజా సంబంధాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ కూడా మరో కోటరీ ఉంది. వేరే వాళ్ళ నిర్ణయాలని కూడా పట్టుంచుకోకుండా వీరు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇలా Andhra లో  కోటరీలు పెరిగిపోవడంతో…ఒకరి నిర్ణయాన్ని…మరొకరు ఆమోదించే పరిస్తితి కూడా ఉండటం లేదట. ఇదే పరిస్తితి కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముందని మిగతా అధికారులు చెవులు కోరుకుంటున్నారట. మొత్తం మీద జగన్ ప్రభుత్వంలో కూడా కోటరీలు పెరిగిపోయాయి అనమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version