తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటన జారీ చేసింది. మార్చ్ 10 నుంచి గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా మార్చ్ 10న గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించింది. మార్చి 11న గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్,
మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ను విడుదల చేయనుంది. అలాగే ఈనెల 17న
హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసరు రిజల్ట్స్ ప్రకటించనుంది.
రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 21,093 మంది అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్ పేపర్ వ్యాల్యూయేషన్ ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మరిన్ని ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపింది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని త్వరగా క్లియర్ చేసి, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.