ఒకప్పుడు ఎలా ఉండేదంటే.. మహిళలు పని చేయాలి అంటే ఒకటి లేదా రెండు డోర్స్ మాత్రమే ఓ పెన్ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచమే మన మహిళలది అని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద పేర్కొన్నారు. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఓ సమావేశంలో మాట్లాడారు. మహిళలు ఏదైనా సాధించాలనుకుంటే అడ్డు అదుపు లేదు అని మనం నిరూపిస్తూనే ఉన్నామని తెలిపారు. ఇంకా చాలా ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
2025 ఇంటర్ నేషన్ ఉమెన్స్ డే థీమ్ జనరల్ ఈక్వాలిటీ ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంది అనుకుంటున్నాను. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా చెబుతున్నాను. మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ముఖ్యంగా ఒక తల్లిగా, భార్యగా, కూతురిగా అన్ని పాత్రలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉందన్నారు. మనం ఎన్ని సాధించినా.. ఎంత ముందుకు వెళ్లినా ఆ ఎంపవర్ మెంట్ మీనింగ్ అనేది ఈ సొసైటీలో అందరూ అర్థం చేసుకున్నారా..? లేదా అనేది చాలా ముఖ్యం అన్నారు.