నేరస్తులకు యూపీ సీఎం యోగీ మార్క్ ట్రీట్ మెంట్ అయిన బుల్డోజర్ల కల్చర్ ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతోంది. నేరాలకు, అల్లర్లకు పాల్పడ్డ వ్యక్తులకు బుద్ది చెప్పేందుకు యోగీ ఆదిత్యనాథ్ బుల్డోజర్లను వాడుతున్నాడు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడు. సేమ్ ఇదే ట్రీట్ మెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి. తాజాగా గుజరాత్ ఆనంద్ జిల్లాలో ఖంభాత్ శ్రీరామ నవమి రోజున రాళ్లు రువ్వుతూ హింసకు పాల్పడిన వ్యక్తుల ఇల్లీగల్ ఆస్తులను ధ్వంసం చేస్తోంది గుజరాత్ సర్కార్. అల్లర్లకు పాల్పడిన నిందితుడి ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేసింది. పోలీసులు స్వయంగా దగ్గరుండీ మరీ నిందితుడి ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదే విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఖర్గోన్ నగరంలో శ్రీరామ నవమి రోజున మరో వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఊరేగింపు సమయంలో రాళ్లు రువ్వుతూ అల్లర్లకు కారణం అయ్యారు. ఈ ఘటనకు కారణం అయిన వ్యక్తులకు గుర్తించి… వారి ఆస్తులను కూడా బుల్డోజర్లతో కూల్చివేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
#Gujarat | Properties belonging to the accused in Khambhat violence were demolished by the administration pic.twitter.com/sQY2VgUmOf
— TOI Ahmedabad (@TOIAhmedabad) April 15, 2022