KGF2: ట్రెండ్ ఇన్: బాక్సాఫీస్ మొగుడు రాఖీ భాయ్..రికార్డులను తొక్కుకుంటు పోతున్న ‘కేజీఎఫ్2’

-

కేజీఎఫ్ 2 సినిమాను దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఒకే రోజులో దేశవ్యాప్తంగా రూ.134 కోట్లు కలెక్ట్ చేసి ఇంతకు ముందున్న రికార్డులన్నిటినీ తొక్కుకుంటు ముందుకుపోతున్నది. దాంతో సినీ అభిమానులు సంబుర పడుతున్నారు.

ముఖ్యంగా కన్నడిగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో తమకు సరైన గుర్తింపు లేదని, అసలు కన్నడ చిత్ర సీమ ఉందన్న విషయాన్ని కొందరు గుర్తించబోరని, అటువంటిది కన్నడ చిత్రానికి దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ లభించడం పట్ల సంతోషపడిపోతున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్- హీరో యశ్- ప్రొడక్షన్ హౌజ్ హొంబలే ఫిల్మ్స్ ఇతర సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సినిమా కోసం ఓ టీమ్ గా వర్క్ చేశారు. వారందరూ చాలా కష్టపడి ఏళ్లు పని చేయగా, ఆ ఫలితం ఇప్పుడు దక్కుతోంది. ఈ క్రమంలోనే నెటిజన్లు సినీ అభిమానులు #KGF2BoxOfficeMonster హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేస్తున్నారు. అలా వరుస ట్వీట్స్ తో ఈ హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఈ సందర్భంగా సినీ అభిమానులు ఇక భవిష్యత్తులో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుందని, రీజినల్ బ్యారియర్స్, హద్దులు చెరిపివేయబడ్డాయని అంటున్నారు. RRR తర్వాత అంతటి స్థాయిలో ఆదరణ పొందుతున్న చిత్రంగా KGF2 నిలుస్తోంది. బాక్సాఫీసుకు మొగుడు రాఖీ భాయ్ అలియాస్ రాకింగ్ స్టార్ యశ్ అని అభిమానులు కామెంట్స్ చేస్తు్న్నారు.

ఇండియన్ బాక్సాఫీసు మాన్ స్టర్ యశ్ ..కేజీఎఫ్ చాప్టర్ 2 అని చెప్తున్నారు. వరల్డ్ క్లాస్ మూవీ కేజీఎఫ్ 2 అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని పేర్కొంటున్నారు. గురువారం విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరుతుందని సినీ పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version