ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఆ సేవలు కూడా !

-

ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. తల్లీబిడ్డా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా అత్యాధునిక యంత్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 56 టిఫా యంత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు 26 ఆప్తల్మిక్‌ ఎక్విప్‌మెంట్‌ సైతం ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.

ఎంసీఆర్‌ హెచ్‌డీలో సోమవారం టీఎస్ ఎంఎస్ఐడీసీ, ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్షను సోమవారం నిర్వహించారు.కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిఫా యంత్రాలతో గర్భిణులు టెస్టుల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. టీ డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా థైరాయిడ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక గర్భిణులు టెస్టుల కోసం బయటికి వెళ్లే అవసరం ఉండబోదన్నారు. ఈ సందర్భంగా సివిల్, ఎక్విప్‌మెంట్‌, ఈ – ఉపకరణ్, డ్రగ్స్, సర్జికల్, డయాగ్నొస్టిక్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై చర్చించారు. గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version