గడ్డంతో గిన్నిస్ రికార్డ్..ఏకంగా 710 బబుల్స్ తో..

-

గిన్నిస్ రికార్డ్ అనేది అత్యంత అరుదైన రికార్దు..కనివిని ఎరుగని రీతిలో జనాల దృష్టిని ఆకర్షించే దానికి గిన్నిస్ లో చోటు దక్కుతుందన్న విషయం తెలిసిందే..ఇప్పటికే ఎన్నో విషయాలను గిన్నిస్ లో చోటు దక్కింది..అన్నిటికన్నా భిన్నమైన విధంగా ఒక రికార్డును అందుకున్నాడు.తన గడ్డాన్ని వెరైటీగా పెంచి అందరికి షాక్ ఇచ్చాడు.. ఆ గడ్డం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యూత్ కు గడ్డం ఒక ఫ్యాషన్. ఇది ఒక ట్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు. అబ్బాయిలు గడ్డం త్వరగా పెరగడానికి క్రీమ్స్, ఆయిల్స్ పూస్తూ ఉంటారు. అలాగే ఆ గడ్డంతో ఎన్నో రకరకాలైన స్టైల్స్ ను క్రియేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్ స్ట్రాసర్ అనే వ్యక్తి తన గడ్డాన్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. దాన్ని నిత్యం ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటాడు.

అలాగే తన గడ్డం ఎంతో ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ తన గడ్డాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇతను పెంచిన తన గడ్డానితో ఇప్పటికే ఎన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించాడు. తన గడ్డంతో నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించాడు. అయితే మొత్తం ఇతను తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించాడు..నిజంగా ఇది నమ్మశక్యంగా లేకున్నా కూడా ఇది నిజమే..

ఇకపోతే స్ట్రాసర్ తాజాగా మరోసారి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సారి అయితే 710 బబుల్స్ తో రికార్డు కొట్టాడు. అయితే మొదటిసారి అతను 2019లో 302 బబుల్స్ రికార్డులోకి ఎక్కాడు. అయితే మరుసటి ఏడాదిలో 542 బబుల్స్ తో అలాగే 2021లో 686 బబుల్స్ తో రికార్డును బద్దలు కొట్టాడు. అయితే క్రిస్మస్ సందర్భంగా అతను తన గడ్డానికి క్రిస్మస్ చెట్టుకు అలంకరించే బబుల్స్ తో తన గడ్డాన్ని అందంగా తీర్చిదిద్దాడు.ఇది అందరిని ఆకట్టుకుంది..ఇప్పుడదే వరల్డ్ రికార్డులను తెచ్చిపెట్టింది..

Read more RELATED
Recommended to you

Latest news